Logo
Date of Publish : 10 August 2023, 9:26 pm
Editor : Sake Naresh

పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి శూన్యం : రామా శ్రీనివాస్

         రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం లోని సుండుపల్లి మండలంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పాదయాత్ర పెద్దబలిజపల్లి నుండి సుండుపల్లి తాసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్లమెంటు ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. అన్నమయ్య డ్యాం,పింఛ ప్రాజెక్టులు తెగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. సుండుపల్లి మండలంలో సిమెంట్ రోడ్డు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీనీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి నందలూరు మండల మాజీ జడ్పీటీసీ శివరామరాజు, దళిత నాయకులు పల్లం నాగేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు మహదేవ తదితరులు సంఘీభావం తెలిపారు. సుండుపల్లి తాసిల్దార్ కార్యాలయంలో సర్వే రక్షిత కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు రెడ్డి రాణి, మండల అధ్యక్షుడు ఓబులేసు, వంటేరు రాజా, మచ్చ లక్ష్మీనారాయణ, మడితాడు సలీం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com