నర్సీపట్నం, (జనస్వరం) : ఉత్తర వాహిని నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల వ్యర్దాలు నదిలోకి పోయి అనేక అనర్థాలకు కారణమవుతున్న పట్టించుకునే నాధుడు లేడని జనసేన పార్టీ కన్వీనర్ రాజ సూర్య చంద్ర విమర్శించారు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం, లింగాపురం వార్డు ప్రజల ఫిర్యాదుల మేరకు ఉత్తర వాహిని ప్రాంతాన్ని తనిఖీ చేసినప్పుడు అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నదీ వ్యర్థాల కలుషితం వలన కార్తీక మాసంలో స్నానం చేసే భక్తులకు, చర్మ వ్యాధులు వస్తున్నాయని, ఇదే నీరును తాగుతున్న పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలో పోరు బాట పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, అద్దేపల్లి గణేష్, గూడెపు తాతబాబు, నాగు, కొత్తకోట రామ శేఖర్, మల్లాడి శ్రీను, గండం దొరబాబు, వేగిశెట్టి శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com