నెల్లూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కార్యక్రమం “జగనన్న ఇల్లు పేదలందరికీ కనీళ్లు” . ఈ కార్యక్రమం నెల్లూరు నగరం లో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీ లో ని మునక ప్రాంతం లో పేదలకి అందించిన జగనన్న ఇళ్ల ప్రాంగణంలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ ఈరోజు రేపు ఎలుండి పవన్ కళ్యాణ్ గారి పిలిపు మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం మొదలుపెట్టాము. జగన్ రెడ్డి రాష్ట్రము లో 28లక్షల ఇళ్లలో 18 లక్షల ఇల్లు June 2022 లోపల పేదలకి ఇల్లు కటిస్తామన్నారు కానీ ఇప్పటికి ఇక్కడ 50 ఇల్లు కూడా అందివ్వలేదు. పేదల ఇళ్ల విషయం లో లబ్ధిదారులు చాల ఇబ్బందులు పడుతున్నారు . ఇది ఆంధ్ర రాష్ట్రము లో నే అతి పెద్ద బారి స్కామ్ గ పెరిగినలోకి తీసుకోవచ్చు మనం చూసుకుంటే భూ సేకరణ లో స్కామ్ , లెవెలింగ్ లో స్కామ్ , సిమెంట్ లో స్కామ్ అడుగు అడుగు న స్కామ్ జరిగింది . నెల్లూరు నగరం లో అయితే ఒక లోతట్టు ప్రాంతం లో చిన్నపాటి వర్షానికే జలమయం ఆయె మునక ప్రాంతం లో స్థలాలను కేటాయించి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు ఈరోజు మేము ఇటుగా నడుచుకుంటూ వస్తే మొత్తం బురద నీలతో జలమయం అయినా ప్రాంతం ల వుంది అని ప్రజలు బాధ పడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు . స్థానిక శ్యాసనసభ్యులు గడప గడప తిరుగుతూ అభివ్రుది అంటున్నారు కానీ మనం చూసుకుంటే పేదల ఇళ్ల విషయం లో నే ఈ ప్రభుత్వ తీరు ని చూడవచ్చు అన్నారు . పిల్లర్స్ లేకుండా slabes కటించే విధానాన్ని కనిపెట్టిన జగన్ గారు . ఇక్కడ చేరితే ఎప్పుడు ఈ ఇల్లు కూలిపోతాయి అని భయబ్రాంతులకు ప్రజలు గురిఅవుతున్నారు అని రానున్న 3 రోజులు నెల్లూరు జిల్లా వున్నా జగనన్న ఇల్లు కాలనీలు అన్ని సందర్శిస్తాం “జగనన్న ఇల్లు పేదలందరికీ కనీళ్లు” అనే కార్యక్రమం ద్వారా #జగనన్నమోసం అనే జనసేన నాయకులూ కార్యకర్తలు అందరు సోషల్ మీడియా లో ఒక ఉద్యమం ద్వారా ఫొటోస్ అన్ని ప్రచురిస్తాం అని ఇది ఒక సోషల్ ఆడిట్ ల జనసేన పార్టీ తరుపున అన్ని ప్రాంతాలను సందర్శిస్తాం ప్రతి ఒక లబ్దిదారులకు అండగా మేము నిలబడుతాము అని తెలిపారు. నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు తో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో నేడు నగరం లో ని జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టాము . జగనన్న ప్రతి పేదవాడికి 9 అంకణాలో ఇల్లు కట్టిస్తాం అని చేపి ఇప్పడు 6 అంకణాలకి దాని పరిమితం చేసి అక్కడ కూడా పిల్లర్స్ లేకుండా స్లాబులు నిర్మించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిదే అని ఇక్కడ వాడుతున్న ఇసక , సిమెంట్ , ఫ్లై-హాష్ బ్రిక్స్ ని చూస్తుంటే ఇంత నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారో అది కూడా ఒక మునక ప్రాంతంలో ఇటు నిర్మాణం చేసి పెద్ద ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది అని . ముద్దుల తో ముఖ్యమంత్రి అయినా జగనన్న ఇప్పడు మోసాల ముఖ్యమంత్రి అయ్యారు అని అన్నారు . నెల్లూరు నగరం లో జనసేన నాయకులూ కార్యకర్తలు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియా వేదికగ #జగన్నామోసం అని నినాదం తో జనం లోకి తీసుకోని వెళ్తున్నారు అని అన్నారు . ఈ కార్యక్రమం జగనన్న చేసిన మోసాన్ని జనం మధ్యలో కి తీసుకోని వెళతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.