ప్రజాస్వామ్యానికి జీవం పొసే నాలుగో స్థంభం లాంటివి పత్రికలు. మానవుని జీవితం తన చుట్టూ ఉన్న సమాజంతో ముడిపడి ఉంటుంది. నిత్యం జరిగే సంఘటనలు, విశేషాలను, వివాదాలను వార్తలుగా ఒక దగ్గర చేర్చి ఆ సమాచారాన్ని అందరికీ అందించేందుకు పత్రికలు రూపుదిద్దుకున్నాయి. ప్రపంచ వ్యాప్త సమాచారాన్ని చేర్చి, కూర్చి నేర్పుగా జనాన్ని ఆకట్టుకుంటూ ప్రాముఖ్యత పెంచుకుంటూ ఎన్నో పత్రికలు ప్రాణం పోసుకున్నాయి. వారం కిందటి వార్తను విశేషంగా చెప్పుకునే ప్రచురణ స్థాయి నుండి క్షణాలలో సమాచారం విశ్వ వ్యాప్త సంచలనాలను కంప్యూటర్ ద్వారా సృష్టించే సమాచార విప్లవంగా ఆధునికత సంతరించుకుంది. ఈ పత్రికలు వివేకంతో విషయ పరిజ్ఞానాన్ని, విలువలు నిండిన నిష్పక్షపాత ధోరణిలో, భావోద్వేగాలను, రాగ ద్వేషాలను అతీతంగా వివరించే సాధనంగా ఉండాలి. నేటి పత్రికా రంగంలో ఇవి ఆశించటం అత్యాశే అవుతుంది. సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడే విధానం మారిపోయి వ్యాపార ధోరణి పెరిగింది. విపవాత్మక మార్పుల కారణంగా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విలువలు వదిలేస్తున్నారు. వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అధికారంలో ఉన్న వారి అండ తప్పనిసరి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారు. వారి మెప్పు కోసం, ఆదాయం కోసం గన్ను కన్నా పదునైన ఆయుధం పెన్నును తాకట్టు పెట్టేస్తున్నారు. అబద్ధాల అక్షరాలు అలవోకగా రాసేస్తున్నారు. వివాదాలను సృష్టిస్తున్నారు. విలువలు మరిచి సంబంధంలేని వార్తలను సంచలనాలుగా చూపిస్తున్నారు. వీటికి తోడు సామాజిక మాధ్యమాల హోరు 21వ శతాబ్దాన్ని కొత్త పుంతలు తొక్కించింది.
రాజకీయ పరంగా పత్రికల స్థానం వివరించలేని స్థితి నిష్పక్షపాతంగా సమాచారం, విశేషాలు అందించాల్సిన పత్రికలు పక్ష పాతం చూపుతూ కులానికి, పార్టీలకు కొమ్ము కాస్తూ డబ్బుకు దాసోహం అయి పోయి విలువల వలువలు విడిచి నిసిగ్గుగా వ్యవరిస్తున్నాయి. విమర్శలు ఉండవు, విజ్ఞత ఉండదు, విచక్షణ ఉండదు. సమాచార సాధనాలు కాస్తా జనం దృష్టి ఆకట్టుకునే ప్రచార సాధనాలుగా మారిపోయాయి. ఒక్కో పార్టీ కొన్ని వార్తా పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్లు ఏర్పాటు చేసుకొని ప్రచార ఎత్తుగడలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాయి. ధన బలం, అధికార బలం, మీడియా బలం ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తప్పును కూడా ఒప్పుగా చూపించేస్తుంటారు. ముద్దాయిని కూడా మహానుభావుడిగా కీర్తిస్తుంటాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మూడో పార్టీ జనసేన విషయానికి వస్తే ఎంత మంచి పనులు చేసినా వార్తలు వేయరు, ప్రసారం చేయరు.
జనసైనికులు నా ప్రచార సాధనాలు అన్న అధినేత మాట సామాజిక మాధ్యమాల వేదికగా బలమైన గళంగా మారి నిజం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కొరకు అర్ధ బలం, అంగ బలం లేని సామాన్య జనసైనికుని చిన్న ప్రయత్నం ఈ పేపర్ గా వారం వారం వార్తల సమాహారంగా జనస్వరం ప్రారంభించారు. మనసున్న జనసైనికుల అండ, ఆర్ధిక సహాయంతో పేజీలతో జనస్వరం మొదటి సంచిక 14 జూలై 2020 తేదీన ప్రతి ఆదివారం ప్రచురించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొందరు జనసైనికులు, వీర మహిళల స్వచ్ఛంద సహకారంతో వివిధ రకాల విషయాలపై, జనసేన పార్టీ పోరాటాలపై సంపాదకీయం అందిస్తున్నారు. అధినేత జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒక ప్రత్యేక సంచికను పుస్తకంగా మలిచారు. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రశంసలు పొందగలిగి విజయం సాధించింది అనే చెప్పాలి. నూతన సంవత్సరం నుండి నారీస్వరం ద్వారా ప్రతి విషయంపై చిన్న పాటి విశ్లేషణలుగా రాస్తున్నాము. ఇప్పటికి 25 వారాలు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నాము. మా చిన్న ప్రయత్నాన్ని, జనస్వరం ఈ వార పత్రిక ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆధరాభిమానాలతో మరింత బలం పుంజుకుని పార్టీ అభివృద్ధికి పాటు పడతామని తెలియచేస్తున్నాం. రాజకీయాల్లో మార్పు కోరే అధినేత ఆశయ సాధనలో బాధ్యతతో మేము చేస్తున్న మా వంతు నిస్వార్థ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి.
- టీం నారీస్వరం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com