అనంతపురం ( జనస్వరం ) : డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు అధ్యాపకులుగా, సాహితీవేత్తగా అవధానిగా తెలుగు వారందరికీ సుపరిచితులు సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో భాగంగా వారు అనేక రచనలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి దుద్దేకుంట వెంకటేశ్వర రెడ్డి పత్రికాముఖంగా తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందూ ధర్మం పట్ల వారికున్న అభిప్రాయాన్ని అధ్యయనం చేశారు. హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను వారి ఎత్తి చూపుతూనే దళితులు నిమ్న వర్గాల వారు మత మార్పిడులకు ప్రలోభాలకు గురికాకుండా వారిని చైతన్య పరిచారు. వారితో నాకు వ్యక్తిగతంగా ప్రబంధము ఉంది. వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు వారి స్వగృహానికి వెళ్ళి ఘనంగా సన్మానించడం జరిగింది. అప్పుడు వారు అన్న ఇటువంటి మాటలు ఈరోజు నాకు గుర్తున్నాయి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు సామాన్యులకు అట్టడుగు వర్గాల వారికి పద్మ అవార్డులు ఇవ్వడమనేది గొప్ప విషయంగా వారు చెప్పారు. వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క విభాగమైన “సమరసత సేవా” కు ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యక్షులుగా సేవలందించారు. సాహితీరంగంలో చేసిన విశేష కృషి వలన తెలుగు రాష్ట్రాలలో అనేకమంది అభిమానులను సంపాదించుకోగలిగారు. వారు పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్న సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది. ఆశావాది ప్రకాష్ రావు గారి వంటి ఉన్నత విలువలు కలిగిన సాహితీ వేత్తను కోల్పోవడం సాహితీలోకానికి తీరని లోటు. వారు ఈ భూమిమీద లేనప్పటికీ రచించిన రచనలు నేడు తెలుగు వారందరికీ అందుబాటులో ఉంటాయి. మరొక్కసారి శ్రీ ఆశావాది ప్రకాశరావు గారికి సద్గతులు కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఘన నివాళి అర్పిస్తున్నాని తెలిపారు.