న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం సభ్యులు సురేష్ వరికూటి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల జనసైనికులతో జూమ్ సమావేశం కావడం చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని దేశాల జనసైనికులను ఒక తాటిమీదకు తీసుకురావడానికి కృషి చేస్తున్న JSP గ్లోబల్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చేశారు. ఇలా అన్ని దేశాల వారు ఐక్యమత్యంగా ఉండటం వల్ల జనసేనపార్టీ ఐక్యతను సూచిస్తుంది అన్నారు. పూర్తి స్థాయి నియోజకవర్గ ఇంచార్జ్ లను నియమించడానికి జనసేనాని కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గ స్థానాల్లో బలమైన నాయకులను నియమించడానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనపార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలు సామాన్యుని దగ్గరికి చేరి, జనసేన పార్టీని అభిమానించడం మొదలుపెట్టారన్నారు. సోషల్ మీడియా మనకు ఉన్న బలమైన ఆయుధమని, ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనపార్టీని సామాన్య ప్రజలకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చేరవేయడంలో మనకు అంత సహకారం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా మద్దుతు ఇస్తున్నది కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారేనని అన్నారు. అమరావతి రాజధానిగా జనసేనపార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సీనియర్ నాయకులు సైతం ఓటమిని చవిచూసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి బస్ యాత్ర అన్ని అంశాల్ని కూలంకషంగా పరిశీలించి, బలమైన వ్యూహాత్మక విధానాలతో ప్రజల్లోకి వచ్చేట్టుగా ప్రణాళికలు జనసేనాని సిద్ధం చేస్తున్నారని అన్నారు. అలాగే నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను కందుల దుర్గేష్ గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు.