Logo
Date of Publish : 07 December 2023, 10:18 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) :   ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు చేయించడం జరిగింది. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని, ఓటు విలువ అందరూ గ్రహించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని, అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని కోరారు. గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, పేట చంద్ర శేఖర్, నాయకులు లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, గాయత్రి, జ్యోతి రామ్, ఉదయ్, రాజేష్, సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com