విజయవాడ, (జనస్వరం) : కృష్ణా జిల్లాను రెండుగ చిలిస్తే ఒక దానికి వంగవీటి రంగా జిల్లాగా, అలానే కర్నూల్ జిల్లాకి మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేర్లు పెట్టాలని జనసేన పార్టీ యువ నాయకుడు, కాపు సంక్షేమ సేన పశ్చిమ నియోజకవర్గ యువత అధ్యక్షుడు సమ్మెట రాజా నాయుడు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక స్వాతి థియేటర్ కూడలిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చేందుకు మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపటినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణ జిల్లాను రెండుగా చేసేలా అయితే ఒక దానికి బడుగు, బలహీన వర్గాలకు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసి వారికి అండగా నిలిచిన వంగవీటి మోహన రంగా పేరును ఒకదానికి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే కర్నూల్ జిల్లాకు దళితుడు, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు, రాము నాయుడు, చందు, చలేశ్వర్, కిషోర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com