Logo
Date of Publish : 19 September 2022, 2:53 pm
Editor : Sake Naresh

నెల్లూరు సిటీలో కేతంరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలోకి నూతన చేరికలు

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గం 11వ డివిజన్ నుండి శ్రీమత్రి జోరెపల్లి విజయారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అఖిల్ రెడ్డి, సాయి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమక్షంలో 50 మంది పార్టీలో నూతనంగా చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పిన కేతంరెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 126వ రోజున 50వ డివిజన్ సంతపేట ప్రాంతంలో పాల్గొని ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న పవనన్న ప్రజాబాటని అపూర్వంగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. నేడు పార్టీలోకి చేరిన వారిలో అధికమంది వీరమహిళలు ఉండడం శుభపరిణామమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేతంరెడ్డి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com