
విశాఖపట్నం (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డు పాత గోపాలపట్నంలో జనసేన పార్టీ పశ్చిమ నాయకులు శ్రీ పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారు పార్టీ జెండా ఎగురవేసి, పార్టీ బలోపేతానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ యువకులు, మహిళలు పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది. వారు మాట్లాడుతూ నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా, జనసేన శ్రేణులను ఉత్తేజపరుస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దంటూ జనసైనికులకు భరోసానిస్తూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ కలసి ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని కార్యకర్తలకు నిర్ధేశించారు. అలాగే వార్డులో పలు సమస్యలకు పరిష్కారం కొరకు పోరాటం చేసేందుకు పార్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.