Logo
Date of Publish : 25 January 2022, 5:02 am
Editor : Sake Naresh

యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలు

     యస్ కే యూ, (జనస్వరం) : స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యస్ కే యు భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు హెన్రీ పాల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన పోరాటం, త్యాగం, ఆయన ధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. భారత స్వతంత్ర సమర యోధుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో, మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం తరుపున 125 జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు. స్వాతంత్ర సమర యోధులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ "నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని తెస్తాను" అని వారి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పిస్తూ వారికి దేశం పట్ల ఉన్న భక్తి, మనందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు లోకేష్, మధు వంశీ, దివాకర్, రాజు తదితర విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com