పెందుర్తి ( జనస్వరం ) : నరవ వార్డు సచివాలయంలో వెల్ఫేర్, రెవెన్యూ, మరియు కొంతమంది వాలంటరీస్ ప్రజలను అక్రమంగా డబ్బులు అడుగుతున్నారని జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్ అన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ కు అర్హులైన ప్రజలు వద్ద సరైన డాక్యుమెంట్స్ లేనప్పుడు డాక్యుమెంట్స్ సరిదిద్దడం కోసం, వారికి వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం కోసం ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. వార్డ్ అడ్మిన్ చొరవ తీసుకుని దోపిడీని అరికట్టమని అధికారులను కోరడం జరిగింది. అడ్మిన్ బదులిస్తూ నా దృష్టికి కూడా రావడం జరిగిందని, తప్పకుండా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాలంటరీ సచివాలయం ఎంప్లాయిస్ మీటింగ్ పెట్టి మన పని మనం సక్రమంగా చేద్దామని, మరొకసారి ఇటువంటి తప్పుడు పనులు జరక్కుండా చర్యలు తీసుకుంటానని బదులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు బొడ్డు నాయుడు, గవర శ్రీనివాసరావు, గవర రాజు పాల్గొన్నారు.