Logo
Date of Publish : 14 December 2022, 4:42 pm
Editor : Sake Naresh

నెల్లూరు రూరల్ 33వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యములో రక్తదాన శిబిరం ఏర్పాటు

       నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ వెంగళరావు నగర్ లో గతంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా పని చేసిన ఆరవ విజయ్ కాంత్ మొదటి జయంతి సందర్భంగా స్థానికంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా దృక్పథంతో చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ఎంతో అభినందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాకేం ఇచ్చిందని ఎవరైనా అడిగితే అంతులేని అభిమానం పంచే తమ్ముళ్లనిచ్చిందని చెప్పుకుంటాను. తోడబుట్టిన వాళ్ళిద్దరైతే తోడు నడిచే వాళ్ళు ఎంతమందో లెక్క కూడా పెట్టలేకున్నానని తెలిపారు. ఇంతమంది అభిమానించే తమ్ముళ్ళను ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనకు వారదిగా వ్యవహరిస్తున్నాని నా వెనుక నడిచే తమ్ముళ్ల అందరికీ మార్గదర్శకంగా నడుచుకుంటానని తెలిపారు. అరవ విజయ్ కర్ర సాము వంటి కళలలో ప్రవీణ్యం గల సోదరుడు తక్కువ వయసులోనే మాకు దూరవడం నిజంగా దురదృష్టమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ సోదరుని స్మ్రు తి నివాళులర్పిస్తూ జనసేన పార్టీ తరపున చిన్న రాజా బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసి దాదాపు 50 యూనిట్ల రక్తాన్ని అందించడం అభినందనీయమని తెలిపారు. విజయ్ కాంత్ గతంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో చురుకులుగా పాల్గొనే వారిని నెల్లూరు రూరల్ లో జనసేనకి గట్టిగా పట్టున్న ప్రాంతం 33 వ డివిజన్ అనీ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పట్టం కట్టే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, వినోద్, జాన్ పాల్, ఉద్దేష్, మిధున్, కంథర్, అమీన్, అలేఖ్, ఖలీల్, ప్రసన్న, ఇంతియాజ్, షాజహాన్, హేమంత్ యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com