
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 28 డివిజన్లకు సంబంధించి అభ్యర్థిత్వం ఆశిస్తున్న పలువురు ఆశావహులు నేడు జనసేన పార్టీ నెల్లూరు సిటీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డికి దరఖాస్తులు సమర్పించారు. మేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన జనసేన వీరమహిళ ఝాన్సీ తొలి ధరఖాస్తుని కేతంరెడ్డికి అందజేయడం గమనార్హం. మొదటిరోజు 15 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా వారిలో 8 మంది మహిళలు కావడం ఆనందకరమని, మైనారిటీ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుండి అధిక దరఖాస్తులు వచ్చాయని, కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే నినాదంతో నెల్లూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో బలంగా నిలబడతామని ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.