నెల్లూరు ( జనస్వరం ) : మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల 4వ రోజు సమ్మెకు మద్దతుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కనబడకుండా తిరుగుతున్నాడన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు కనబడుతున్నాయి. చెత్త బుట్టలో వెయ్యాలి ఈ చేత గాని పాలన చేస్తున్న ఈ చెత్త ప్రభుత్వాన్ని. అర్హత గల మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి. పనిముట్లు కూడా సరఫరా చేయకుండా పని చేయమంటే ఎలా? కార్మికులు తమ సొంత డబ్బుతో పనికి పరికరాలు కొనుక్కోవడం దారుణమని అన్నారు. సంక్షేమ పథకాలేవీ వారికి అందటం లేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఏవి మున్సిపల్ కార్మికులకు అందవు. దశాబ్దాలుగా పనిచేసి 60 ఏళ్లకే రిటైర్ మెంట్ అయితే ఒక్క బెనిఫిట్ కూడా వారికి వర్తించటం లేదు. ఇస్తున్న హెల్త్ అలవెన్సు ఆరు వేల రూపాయలు కూడా ఆపేశారు దానిని పునరుద్ధరించాలి. టైం స్కేల్ అనేది లేకుండా వారి చేత పనులు చేయిస్తున్నారు. నెలలో 30 రోజులు పని చేస్తే ఇరవై నాలుగు రోజులకే లెక్కగట్టి జీతం ఇవ్వటం అమానుషం. వీరి సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జనవాణి జనసేన భరోసా దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు మున్సిపల్ కార్మికులకు అండగా జనసేన పార్టీ తరఫున మేము నిలబడతామని తెలిపారు. గత నాలుగు రోజులు గా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ చేస్తున్న సమ్మెకు జనసేనపార్టీ జిల్లానాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులతో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కలువాయి సుదీర్, భీమ, ఖలీల్, హేమచంద్ర, రాజా తదితరు జనసైనికులు పాల్గొన్నారు.