Logo
Date of Publish : 11 July 2022, 7:53 am
Editor : Sake Naresh

మత్స్యకారుల సమస్యలపై పోరాడుతున్న నెల్లూరు జనసేన నాయకులు

             నెల్లూరు ( జనస్వరం ) : మత్స్యకారులు యొక్క సమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. వాకాడు మండలం తూపిలి పాలెం గ్రామంలో ఆయన పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 50 మంది మత్స్యకారులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన వారికి చంద్రశేఖర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి జిల్లా, వాకాడు మండలం తూపిలి పాలెం పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించి స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మత్స్యకారులు ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ సముద్ర ముఖద్వారాలు పూడిపోయి ఉండడంతో సుమారు 14 గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం నుండి పెద్ద పెద్ద పడవల్లో వచ్చి సముద్రంలో చేపల వేట చేస్తుండడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇక్కడ స్థానికులు తెలిపిన సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి పని చేస్తామని హామీ ఇచ్చారు. మా పార్టీ అధినేత మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని పోరాటం కూడా చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మహేంద్ర, వెంకటేశ్వర్లు, జయరాం, లక్ష్మి మల్లీశ్వర్ రావు, కాపు నాయకులు మహేంద్ర, వెంకటేశ్వర్లు, జయరాం , వెంకటేశ్వర్లు, మోహన్, కోటి, చిట్టి, సుబ్రహ్మణ్యం, రాజేష్, నరేష్, సుకుమార్, నవీన్, హేమంత్, కిరణ్, మోహన్, కోటి, శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com