
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం కలిచేడు గ్రామంలోని 11 వందల ఎకరాలు 150 రైతులకు సంబంధించిన అడంగల్ 1బి భూములను పునరుద్ధరించి పీఎం కిసాన్ రైతు భరోసా సహాయం కొరకు సాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయాన్ని సహాయార్థం సందర్శించారు. జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు వారి సమస్యలను జనసేన పార్టీ తరపున జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకొని అర్హులకు అవసరమైన సర్దుబాట్లు చేయవలసిందిగా సూచించారు. అనంతరం కలిచేడు రైతులందరూ జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారం కాని అడంగల్ 1బి భూముల వెంటనే పరిష్కరించాలని పీఎం కిసాన్ రైతు భరోసా పథకాలను వారికి కూడా అందించాలని జాయింట్ కలెక్టర్ గారిని అడుగగా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రైతులతో తోడుండి స్థానిక సమస్యను పునరుద్ధరిస్తామని జనసేన పార్టీ తరపున తెలిపారు. ప్రజల సమస్య ఏదైనా జనసేన పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పట్టం కట్టి ప్రజా సమస్యలు తీర్చే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రజల సమస్య ఏదైనా జనసేన పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, వెంకటగిరి రైతులు తదితురులు పాల్గొన్నారు.