ఇచ్చిన హామీలలో భాగంగా పధకాలు నెరవేర్చలేని YSRCP ప్రభుత్వం హామీలు పొందే నిజమైన లబ్ధిదారులని ఏరివేసి పధకాలు రాకుండా చెయ్యడానికి కుట్రలు పన్నుతుంది. ఈ క్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం పరిధిలోని బుచ్చిరెడ్డిపాలేం మండలం వడ్డిపాలెం గ్రామంలో నివసించే ఒక నిరుపేద కుటుంబానికి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అనే నెపంతో పధకాలను తీసేసి ప్రజలను ఇబ్బందిపెట్టే పరిస్థితుల్లో ఉన్న క్రమంలో బాధితులకు అండగా జనసేనపార్టీ నిలబడింది. జనసేనపార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు శ్రీ P.టోనిబాబు గారు బాధితులు తరుపున ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, మరియు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ గారికి ఆ నిరుపేద కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ గారు ఈ విషయంపై విచారణ జరిపి ఒక రెండు, మూడు రోజుల్లో బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com