Logo
Date of Publish : 09 September 2021, 5:13 pm
Editor : Sake Naresh

అక్రమంగా జీ.ఎస్.టీ బిల్లులను వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించిన నెల్లూరు జనసేన నాయకులు

      నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుతో ఇతరుల జి.ఎస్.టితో ఫేక్ బిల్లులు వేస్తున్న వారి గురించి నెల్లూరు మైనింగ్ ఏ.డి. గారికి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, దేశమంతటా ఒకే పన్ను విధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు జి.ఎస్.టి.ని అందుబాటులోకి తెచ్చారు. నెల్లూరులో కొంతమంది మైనింగ్ శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి జి.ఎస్.టి. విధానంలో ఉన్న లోపాలను గమనించి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వివరాల్లోకి  వెళితే మైనింగ్ నిర్వహించే బకాసురులు నెల్లూరు నగరంలోని ఓ ప్రముఖ షాప్ జి.ఎస్.టిని తమ మైనింగ్ పనులకు వాడుకుంటున్నారు. ఈ విషయం గమనించిన షాపు యజమాని మైనింగ్ అధికారులకు ఎన్ని సార్లు రిపోర్ట్ చేసినా పట్టించుకోవడంలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా లేక కావాలనే చేస్తున్నారా అనే విషయం తెలియాల్సివుంది. ఒక సామాన్యుడి జి.ఎస్.టి నెంబర్ ని అతనికి తెలీకుండా మైనింగ్ బకాసురులు ఫేక్ బిల్లులు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణం, ఇందులో అధికార పార్టీకి సంబంధించిన బడానాయకులు ఉన్నారని సమాచారం. దీని గురించి పై స్థాయిలో అధికారులు కలగజేసుకుని అందుకు బాధ్యులైన వాళ్ళ మైనింగ్ లైసెన్స్ రద్దు చేయాలని, అధికారులను వెంటనే తమ విధుల నుండి తప్పించి, వాళ్లకి తగిన శిక్ష వేయాలని ఆ షాపు యజమాని కోరుతున్నాడు. లేని పరిస్థితుల్లో ఇందులో ఉన్న ప్రతీ ఒక్కరిని వదిలేది లేదు అని, న్యాయ పొరటానికైనా సిద్ధం అని అన్నాడు. ఆయనకి అండగా జనసేన పార్టీ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర నాయకులు సుజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మున్వర్ బాషా, నాయకులు వరకుమార్, వర, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com