నెల్లూరు ( జనస్వరం ) : గత 5నెలలుగా జెన్కో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ సూచనలతో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు జిల్లా కమిటీ సభ్యులు ముత్తుకూరులో వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన ముడి సరుకులు ఇవ్వండి ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తాం అని సిబ్బంది అంటుంటే ఈ వైసిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్లకూడ లేదన్నారు. 21 వేల కోట్ల ప్రజాధనం పెట్టుబడితో స్థాపించిన జెన్కో సంస్థను లీజుకు ఇవ్వడం అమానుషమన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రైవేట్ సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం. నిర్వహణ లోపంతో తక్కువ వ్యయానికి కరెంట్ ఉత్పత్తి చేయగలిగి ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తుంది. జెన్కో స్థాపనకు 1490 ఎకరాల్లో వ్యవసాయ దారుల నుంచి భూముల సేకరించిన ప్రభుత్వం ఇప్పడు వేరెవరికో దారాదత్తం చేయాలనుకుంటుంది. 2014లో పూర్తయిన రెండు యూనిట్లు ఇప్పుడు 80 శాతం పూర్తయిన యూనిట్ తో కలిపి 2400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న ప్రభుత్వ సంస్థను ప్రైవేటు పరం చేసి వారి వద్ద అధిక ధరలకు కొనాలనుకుంటున్న దుస్థితి ఏర్పడిందన్నారు. నిరంతరాయంగా నాణ్యమైన బొగ్గు సరఫరా ఉంటే నాణ్యమైన కరెంటు తక్కువ ఖర్చుతో తయారు నాణ్యమైన కరెంటు ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్న కంపెని దనాపేక్ష తో నిర్వీర్యం చేయనుంది. 30 వేల మిలియన్ ఆర్డరు ఉన్నా ఉన్న మ సంస్థ నుంచి 16430 మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసి మిగిలింది ప్రైవేటు సంస్థల నుంచి సైకో రేట్లు కొనుగోలు చేయడం అమానుషం. కమీషన్ల కి ఆశపడో లేక మరేతర కారణాల వల్ల నాలెడ్జ్ కంపెనీ నుంచి తీసుకు వచ్చిన నాలుగు లక్షల టన్నులు సుమారు 400 కోట్ల రూపాయలు ఎందుకు పనికిరాకుండా బొగ్గు కోర్టులోనే గుట్టలుగుట్టలుగా పడి ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం దారుణం. దాదాపు 1800 మంది సిబ్బంది నిపుణులైన సిబ్బంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరా ఉంటే తక్కువ రేటుకే విద్యుత్తు ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేయగల చేయగల సామర్థ్యం కలిగి ఉంది. సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ సంస్థల్లో కరెంటు ఉత్పత్తి అయితే ఏదైనా విపత్తు సమయంలో కూడా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా వస్తుంది అదే ప్రైవేటు పరం చేసినట్లయితే పేమెంట్ రానిదే విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం వెంటనే ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. పెట్టుబడి లేకుండా అప్పనంగా ఇరవై ఒక్క వెయ్యి విలువగల పరిశ్రమను ప్రైవేటు పరం చేయడం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే విషయమై జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసనలు మరింత ఉధృతం చేస్తాం అన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి జెన్కో సంస్థను ప్రైవేటుపరం కానివ్వకుండా జనసేన పార్టీ తరఫున పోరాడతామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com