
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులైన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, కృష్ణపట్నం వాస్తవ్యులు శ్రీ బొనిగి ఆనందయ్య గారిని జనసేన పార్టీ నాయకులు కలవడం జరిగింది. కష్టకాలంలో ప్రపంచమంతటా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆ తరుణంలో దేవుడు రూపంలో వచ్చి ఆయుర్వేదం మందుని తయారు చేసిన గొప్ప వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసి ఆనందయ్య గారు అని జనసేన నాయకులు అన్నారు. భారతదేశ ప్రజలందరూ ఆయుర్వేద మందు కోసం ఎదురుచూస్తున్నారు. నిరుపేదలు, అభాగ్యులు వెయ్యి కళ్ళతో వేచి ఉన్నారు. అందరి పట్ల కనికరించి అలాంటి నిరుపేదలకు వీలైనంత త్వరలో ఈ ఆయుర్వేద మందుని అందించాలని మదర్ థెరిస్సా గారు ఏ విధంగా అయితే పేదలకు అండగా నిలిచి, వారు అనేక సేవలు అందించారో అదే బాటలో నిలిచి మీరు విలువైన సేవలు పేదలకు ఈ ఆయుర్వేద మందు ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన పార్టీ జనసైనికులు మరియు వీరమహిళలు తరపున కోరడమైనది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు P.టోనీ బాబు గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు రోసనూరు సోమశేఖర్ గారు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మైనార్టీ విభాగం జిల్లా నాయకులు షానవాజ్ గారు పాల్గొని అనందయ్య గారికి శాలువా వేసి జనసేన పార్టీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 13 జిల్లాల్లో జనసేన పార్టీ తరఫున స్వచ్ఛందంగా ఈ ఆయుర్వేద మందులు ఇవ్వడానికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.