Logo
Date of Publish : 27 January 2022, 10:57 am
Editor : Sake Naresh

నెల్లూరు ప్రధాన సమస్యల గూర్చి నాగబాబుకు వివరించిన నెల్లూరు జనసేన నాయకులు

    హైదరాబాద్, (జనస్వరం) : నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఉయ్యాల ప్రవీణ్,అళహరి సుధాకర్ లతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, మెగా బ్రదర్ శ్రీ కొణిదల నాగబాబు అన్న గారిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా, ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన సమస్యల గురించి మరియు ప్రజల తరఫున జనసేన పార్టీ చేస్తున్న పోరాటాల గురించి నాగబాబు గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ ప్రధాన సమస్యలైన చుక్కల భూమి సమస్య, సమగ్ర సోమశిల, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి సంబంధించి భూసేకరణలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క అంతులేని నిర్లక్ష్యం, నియోజకవర్గ రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో జరుగుతున్న అంతులేని జాప్యం, వరదల కారణంగా దెబ్బతిన్న సోమశిల జలాశయం మరమ్మతులు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి వివరించడం జరిగింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిగా ధ్వంసమైన రోడ్ల పరిస్థితి, మెట్ట ప్రాంతమైన ఆత్మకూర్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేకూర్చే పరిశ్రమను, కడప జిల్లాకు తరలించిన విషయంలో ప్రజల పక్షాన జనసేన పార్టీ నిలబడి చేసిన పోరాటాలు, ఈ సమస్యల అన్నిటి పై ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిపిన ఆమరణ నిరాహార దీక్ష మొదలగు అన్ని ప్రజా సమస్యలపై జనసేన పార్టీ చేసిన పోరాటాల గురించి తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com