నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న ఆటెండర్లకు ఆహరం అందిస్తున్న వారిని అడ్డుకున్న అధికారులకు ఉచితంగా ఆహార పోట్లాలు జనసేన నాయకులు మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. లాక్డౌన్ కారణంగా హోటల్స్ సరిగా తీయని కారణంగా మరియు త్రాగునీటి కొరతతో పేషెంట్ తాళూకు అటెండర్లు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టి వచ్చినందునే ఆహరం అందిస్తున్నామని జనసేన నాయకులు గునుకుల కిషోర్ గారు అన్నారు. ప్రభుత్వం వీరికి వసతి ఏర్పాటు చేయవలసినదిగా కోరారు. వరుసగా 3 రోజులు ఆహారం అందించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపుతో కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మరియు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు, అటెండర్లకు కరోనా బాధితులకు మొత్తం 500 మందికి జనసేన పార్టీ కిషోర్గునుకుల గారు, అశోక్ గారు దుగ్గిశెట్టిసుజయ్ గారు సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగింది. ఈ సేవా కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, ఆనంద్, చిత్తూరు బాలాజీ, కోటా బాలాజీ, వినయ్ గౌడ్ తదితరుల పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com