Logo
Date of Publish : 10 December 2025, 8:33 pm
Editor : Sake Naresh

జనసేన వీర మహిళకు 26000 సాయం అందించిన నెల్లూరు జనసైనికులు

నెల్లూరు, అక్టోబర్ 10, (జనస్వరం) : జనసేన పార్టీకి కష్టకాలంలో నిబద్ధతతో సేవ చేసిన కార్యకర్తలకు అండగా నిలుస్తూ నెల్లూరు జనసేన నాయకులు మరోసారి సేవాభావాన్ని చాటారు. తుఫాను సమయంలో పిడుగు పడటంతో కుట్టు మిషన్లతో స్వయం ఉపాధిగా జీవనం సాగిస్తున్న జనసేన వీర మహిళ వాణి షాపు పూర్తిగా దెబ్బతినగా, ఆమెకు పార్టీ తరఫున ₹26000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా గతంలో పార్టీ కోసం కష్టపడ్డ జన సైనికుడు సైలాఫ్ బిడ్డ కదలలేని పరిస్థితుల్లో ఉండటంతో, ఆ బాలికకు వీల్ చైర్‌ను అందజేశారు. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకునేందుకు అవసరమైన సహాయ, సహకారాలు కూడా అందిస్తామని నాయకులు భరోసా ఇచ్చారు. జనసైనికులకు కొండంత ధైర్యం నాయకత్వం స్ఫూర్తి అని పేర్కొంటూ, ఆ సేవాభావాన్ని నిరంతరం కొనసాగిస్తామని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడమే నిజమైన రాజకీయ ధర్మమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, రూరల్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయం ఇంచార్జ్ జమీర్, ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు చదలవాడ హరీష్, ఏఎంసీ డైరెక్టర్ సురేష్, నాయకులు కాకు మురళి, గుర్రం కిషోర్, హేమచంద్ర యాదవ్, నాగేంద్రబాలు, వర్షన్, శ్రీకాంత్, షన్వాజ్, రాజೇಶ್, పవన్ పాల్గొన్నారు. అదేవిధంగా వీర మహిళలు శాంతికల, రేణుక, వాణి, నందిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకుల సేవా మనసును ప్రశంసించారు. కష్టంలో ఉన్న ప్రతి జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com