Logo
Date of Publish : 28 November 2020, 9:39 am
Editor : Sake Naresh

నెల్లూరు వరదలో ప్రకృతి కంటే అధికార తప్పిదాలే ఎక్కువ ఉన్నాయి : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు వరదలో ప్రకృతి కంటే అధికార తప్పిదాలే ఎక్కువ ఉన్నాయి : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

                   నెల్లూరు నగరంలో నివర్ తుఫాన్ ప్రభావిత వరదకు గురైన పలు ప్రాంతాలను జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పర్యటించి వరద బాధితుల గోడును ప్రత్యక్షంగా విని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పలువురు బాధితులు తమకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, హుటాహుటిన పునరావాస కేంద్రాలు అంటూ బడుల్లోకి తీసుకెళ్లారని అక్కడ సరైన భోజన సదుపాయాలు కూడా కల్పించట్లేదాని వాపోయారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో సహజంగా నవంబర్, డిసెంబర్ లలో వర్షాలు కురుస్తాయని తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉందని కనుక రానున్న రోజుల్ని దృష్టిలో ఉంచుకుని సోమశిల జలాశయం నిల్వల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని జిల్లా కలెక్టర్ కు, ఇతర అధికారులకు రెండు నెలల క్రితమే తాము తెలియజేశామన్నారు. సోమశిలలో ఫుల్ కెపాసిటీ వరకు నీళ్ళు ఉంచి ఒక్క సారిగా వదులుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డ్రోన్ షాట్ వీడియోలు, జూమ్ షాట్ వీడియోలు ఎలా తీయిస్తున్నారో దుయ్యబట్టడం జరిగిందన్నారు. ఆనాడే నెల్లూరు నగరం నీట మునిగితే సోమశిలలో ఇన్ ఫ్లో వస్తూనే వుంటుంది మరలా నగరం మునగకుండా ఉండాలంటే 70 టి‌ఎం‌సిల మించి సోమశిలలో ఉంచకండి, విడతల వారీగా నీరు వదిలేస్తూ ఉండండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తే వినకుండా 75 టి‌ఎం‌సిల వరకూ ఉంచుతూ వచ్చారని, నేడు డ్యామ్ ని ప్రమాదంలో ఉంచడమే కాకుండా దిగువ ప్రాంతాల్లో కూడా అనేక నష్టాలకు వీరు కారణం అయ్యారని దుయ్యబట్టారు. ఇప్పుడున్న పరిస్థితికి ప్రకృతి విలయం కంటే ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులూ కార్తీక్ , మహేష్, మోషే , శ్రీకాంత్ , హేమంత్ , రమణ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com