కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న విద్యాశాఖ అధికారులు – నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల

కార్పొరేట్ పాఠశాలల ఫీ’జులుం’
● జిల్లాలో విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ పాఠశాలలు
● మండల,జిల్లా విద్యాశాఖాధికారులు కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారా?
● ఏపీలో పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్(ఏపీఎస్ఆర్ఎంసీ) నిద్రపోతుందా?
● నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల
         నెల్లూరు, (జనస్వరం) : విద్య మనిషిని మనిషిగా తయారు చేస్తుంది. విద్య అంటే మానవునిలో దాగివున్న అంతర-జ్ఞానాన్ని వెలికి తీస్తుంది. విద్య మన ప్రాథమిక హక్కు. మన లోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే అసలైన విద్య అని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. కానీ ఈ రోజు కార్పొరేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఇందుకు నిరసిస్తూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మాట్లాడుతూ ఏపీఎస్ఆర్ఎంసీ సిఫారసుల మేరకు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం గత నెల ఆగస్టు లో జీవో 53, 54 తీసుకొచ్చింది. దీనిలో గ్రామ పంచాయతీల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ.12వేలుగా నిర్ణయించింది. మున్సిపాలిటీల పరిధిలోని ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హై స్కూల్ విద్యకు రూ.15,000లు, కార్పొరేషన్ల పరిధిలో ప్రైమరీ విద్యకు రూ.12,000లు, హై స్కూర్ విద్యకు రూ.18వేలు ఖరారు చేసింది. కానీ కార్పొరేట్ పాఠశాలలు మాత్రం అవేం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు చెల్లించాల్సిందే అంటూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం తేల్చి చెబుతున్నాయి. స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క ఫీజుల వసూళ్ల కోసం స్కూల్స్ యాజమాన్యాల వేధింపులు తల్లిదండ్రులను బాధపెడుతున్నాయి. ఈ రోజుల్లో కార్పొరేట్ పాఠశాలల్లో విద్య అంటే విద్యార్థులకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు, జ్ఞానం ఇవ్వట్లేదు అని, ఈ విధంగా విద్యా వ్యవస్థ ని నిర్వీర్యం చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. ఉచిత వైద్య విద్యా విధానం జనసేన మేనిఫెస్టోలో ఒక భాగం అని, ఈ రెండు ఉచితంగా అందించగలిగినప్పుడు పథకాల అవసరం ఉండదని తన అభిప్రాయమన్నారు. జి.ఓ 53, 54 లో పొందుపరిచిన ఫీజులు మూడేళ్ల వరకు అమల్లో ఉంటాయన్నారు. కానీ మొదటి సంవత్సరం లొనే ఈ విధంగా కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే, ఇంక తరువాత సంవత్సరాలలో ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.వీటిని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్(ఏపీఎస్ఆర్ఎంసీ) పరిశీలించి కార్పొరేట్ పాఠశాలల వారు తీసుకున్న అధిక స్కూల్‌ ఫీజు వాపస్‌ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way