Logo
Date of Publish : 09 February 2024, 9:22 pm
Editor : Sake Naresh

నెల్లిమర్లలో రోజు రోజుకీ జనసేనపార్టీపై పెరుగుతున్న నమ్మకం

    నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట గ్రామంలో లోకం మాధవి గారు పల్లె పల్లెకుజనసేన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జరజాపుపేట గ్రామానికి చెందిన మహిళలు లోకం మాధవి గారిని ఘనంగా స్వాగతించారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికితిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని అలాగే వైసిపి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని, పిలుపునిచ్చారు. జరజాపుపేట గ్రామంలో పర్యటిస్తున్న లోకం మాధవి గారి దగ్గరికి అనేక సమస్యలు వచ్చాయి వాటిలో గ్రామంలో అధికంగా ఉన్న నీటి సమస్య, శుభ్రంగా లేని పారిశుద్ధ్యం,ఊరిలో దయనీయ స్థితి లో ఉన్న కాలువలు వలన ప్రజలు అవస్థలకి గురవుతున్న గ్రామస్థుల గురించి మాధవి గారి దృష్టి కి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆడపడుచులపై జరుగుతున్న అరాచకాలు చూసి ఈ నీచపు ప్రభుత్వంపై విసుగు చెందారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం మాధవి నిత్యం ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి జరజాపుపేట గ్రామంలో సుమారు 300మంది జనసేన పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన మహిళలు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి మాధవి గారి సహాయ సహకారాలు, మంచి మనసు చూసి, పేదవాడు ఎప్పటికైనా పెద్దవాడు కావాలనే మనస్తత్వం ఉన్న ఆవిడని చూసి జనసేన పార్టీలోకి జాయిన్ అయినట్టు తెలియజేశారు.వీరందరికీ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండల యువ నాయకులు రవ్వ నాని మరియు తన అనుచరుగణం వారితో పాటు మద్దిల అప్పన్న, నల్లి దుర్గారావు, తమ్మిని చంద్ర మౌళి, మధ్డిల నాగరాజు, పెడ్డపుడి రాంబాబు, బొడ్డు రమణ, మద్దిల( కృష్ణ) పెద్దయ స్వామి, కనకల అప్పారావు, కరుమంచి గోవింద్, పతివాడ శ్రీనివాస్, వాసు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com