Logo
Date of Publish : 10 January 2024, 11:22 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ కండువా కప్పుకున్న నెల్లిమర్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు

    నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గంలో అంతకంతకు ప్రజాదరణ పొందుతున్న జనసేన పార్టీ, జనసేన తీర్థం పుచ్చుకుంటున్న వైసీపీ నాయకులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో యువజన నాయకుడుగా పనిచేస్తున్న రవ్వ నాని గారు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరగలేదు మరియు రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను సహించలేక ప్రస్తుత పరిస్థితులపై విసుగు చెంది పార్టీ నుంచి విడిపోవడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రంలో జనసేన పార్టీకి ఉన్న ప్రజాధరణ చూసి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మరియు నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి గారు నిత్యం ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న విధానము, రైతులకు పేదలకు మాధవి గారి ఇచ్చే హామీలు మరియు యువతకి ప్రాధాన్యత మొదలగు విషయాలు నచ్చి  రవ్వ నాని గారు ఈరోజు తన అనుచర గణం తో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ లోకం మాధవి గారి ఆధ్వర్యంలో నెల్లిమర్ల మండలం రామతీర్థం జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  మాధవి గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఎలా విఫలం అయ్యాడో , అలాగే చీకటి జీవోలు తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలనే ఎస్మా చట్టం ద్వారా ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, అలాగే ఇళ్ల పట్టాల మీద మోసాలు అభివృద్ధికి నోచుకోని నగర పంచాయతీ పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్డు అవస్థలు నవరత్నాలు అని చెప్తే రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా నయవంచన చేస్తున్నాడు అందరికీ తెలిసిన విషయమే. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కచ్చితంగా యువతకు ఉద్యోగ అవకాశాలకు పెద్ద పీట వేస్తామని అలాగే చేతివృత్తులను ప్రోత్సహిస్తామని రైతుల్ని పేదలని ఆర్థికంగా చూస్తే అభివృద్ధి పరుస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు హాజరవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com