అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం

ప్రాణాలు

    గుంతకల్ ( జనస్వరం ) : పట్టణంలోని శ్రీ విద్యా ప్రైవేట్ స్కూల్ లో రేకుల షేడ్ లో బండ విరిగిపడి చిన్నారి మరణించిన విషయాన్ని తెలుసుకున్న అనంతరం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, జనసేన శ్రేణులు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో అనేక పాఠశాలలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఉన్నాయని, ఫీజుల వసూళ్లకు సంబంధించి విద్యా దోపిడిని అరికట్టాలని అనేక సందర్భాల్లో ఆర్డీవో మరియు విద్యాధికారులకు తెలియజేయడం జరిగింది. అయినా వారు చర్యలు తీసుకోకపోవడంతో అనేకచోట్ల రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చిన్నారి మృతి కారణమైన స్కూల్ ని సీజ్ చేసి, ఇలాంటి స్కూల్ కి అనుమతులు ఇచ్చిన విద్యాధికారులను, స్కూలు యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. మరణించిన చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఆ తల్లిదండ్రులు ముస్తాబు చేసి స్కూల్ కు పంపించడం జరిగింది ఇంతలోనే ఆ చిన్నారి మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడున్నాయో గుర్తించి అలాంటి పాఠశాలలన్నింటినీ తక్షణమే సీజ్ చేయవలసిందిగా ఆర్డీవో మరియు కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం లేని పక్షాన చిన్నారి కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పండు కుమార్, సీనియర్ నాయకులు గాజుల రఘు, ఆటో రామకృష్ణ, మైనార్టీ నాయకుడు దాదు, సూర్యనారాయణ, అమర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way