తణుకు ( జనస్వరం ) : తణుకు పట్టణంలో అధికార పార్టీ నిర్లక్ష్యం వైఖరిని ఖండించిన జనసేన నాయకులు అనుకుల రమేశ్. పట్టణంలో పెద్ద వంతెన సగంలో వంతెనకు ఉన్న రక్షణ గోడ అధిక కాంక్రీట్ బరువు వలన కూలి పడిపోయింది. ఇక ఇప్పుడైనా వంతెనకు సరైన జాగ్రత్తలతో కూడిన నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ తరపున వైకాపాపార్టీ తరుపున అధికార ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు గారిని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొన్ని రోజులలోనే వినాయక చవితి వేడుకలు పూర్తైన తరువాత నిమజ్జనం ఈ వంతెన మీద చేస్తారు. అదృష్టం బాగుండి వంతెన నడక ప్లాట్ ఫాం భాగం ఇప్పుడు కూలిపోయింది. అదే చవితి సమయంలో అయితే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఇక అధికార పార్టీ నిర్లక్ష్యం అనడానికి కారణం నడకకు సంబంధించి ఆ భాగంపై కాంక్రీట్ భారం ఎక్కువగా మోపడం, వంతెన మరమ్మత్తు పనులు చేయకపోవడం, నెరలు తీసి విడిపోతున్న సరే నాయకులు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం చూస్తున్నామన్నారు. ప్రజల ప్రాణాలను మీ నిర్లక్ష్యంతో హరించవద్దని అన్నారు.