కళ్యాణదుర్గం, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదల నాగబాబు సూచనలతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దొడగట్ట చాపిరి గ్రామాలలో పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలుకరించి వారి సమస్యలను, కష్టాలను జనసేన నాయకులు తెలుసుకోవడం జరిగింది. నేడు రాష్ట్రంలో రైతుల బాధలు చెప్పడం వర్ణనాతీతమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మరింత అన్యాయం జరుగుతోందని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారు. దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం, అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో సబ్సిడీ కింద డ్రిప్ పైపులు అందించేవారని, ఇపుడు అవి కూడా అందించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం అని రైతులు వాపోయారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూడా వైసీపీ నాయకుల అవినీతిని కళ్ళారా చూస్తున్న పరిస్థితి అన్నారు. గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతు భరోసా 12500 రూ. ఇస్తామని చెప్పి రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. తీరా రైతులను మోసం చేస్తూ కేంద్రం ఇచ్చే PM కిసాన్ 6000 రూ. కలిపి ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. రైతులను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర గురించి వివరించి, 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని తెలియజేశారు. కడుపు నింపే రైతన్నల కంట కన్నీరు కారని, లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే కౌలు రైతుల ఆత్మహత్యల వార్తలు లేని సమాజాన్ని తీసుకురావాలని జనసేన పార్టీ తరపున ఆకాంక్షిస్తూ రైతు సోదర, సోదరీమణులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన వీర మహిళ షేక్ తార ఆంజనేయులు, జాకీర్, రామలింగ, వంశీ, ముక్కన్న, శ్రీనివాస్ మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.