జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గంలో జాతీయ రైతు దినోత్సవంను రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిపారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలుకరించి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో రైతుల బాధలు చెప్పడం వర్ణనాతీతమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మరింత అన్యాయం జరుగుతోందని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారు. దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం, అత్యల్ప వర్షపాతం కలిగిన రాప్తాడు నియోజకవర్గంలో గతంలో సబ్సిడీ కింద డ్రిప్ పైపులు అందించేవారని, ఇపుడు అవి కూడా అందించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయానికి సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూడా వైసీపీ నాయకుల అవినీతిని కళ్ళారా చూస్తున్న పరిస్థితి అన్నారు. గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతు భరోసా 12500 రూ. ఇస్తామని చెప్పి రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. తీరా రైతులను మోసం చేస్తూ కేంద్రం ఇచ్చే PM కిసాన్ 6000 రూ. కలిపి ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. రైతులను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర గురించి వివరించి, 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని తెలియజేశారు. అలాగే మొదటి విడత కార్యక్రమం మన రాప్తాడు నియోజకవర్గంలో జరగడం, 31 మందికి చెక్కులు ఇవ్వడం గూర్చి తెలియజేశారు. జనసేనపార్టీ తరుపున సేంద్రీయ వ్యవసాయం గురించి, ప్రకృతి వ్య్వసాయయం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, చింత రామచంద్ర, సదా, ముస్తాఫా, m. రామకృష్ణ, పి. రవికుమార్, రజాక్ పాల్గొనడం జరిగింది.