• రైతే రాజు.. రైతు దేశానికి వెన్నుముక..
• విపరీతమైన సంక్షోభంలో కూడా నిలదొక్కుకొని ఉంటున్నాం అంటే కారణం మనది వ్యవసాయాధారిత దేశం ఉండటం.
• నేడు రైతులు అయితే ఎక్కడ కూడా సుఖసంతోషాలతో లేరు.
• వారు ఒక ప్రక్క ఆర్థికంగా ఇబ్బందులుతో సతమతం అవుతుంటే, మరొక ప్రక్క ఈ ప్రభుత్వం విధానం మరింత ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నారు.
• కౌలు రైతుల పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది. ప్రభుత్వ సహాయం అందక ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తుంది.
• వారికి భరోసా నింపడం కోసమే జనసేనపార్టీ ప్రయత్నిస్తుంది.
• అధికారం లేకపోయిన మా అధ్యక్షులు కష్టార్జితం వారికి దారపోస్తున్నారు.
• అధికారం వస్తే రైతులకు ఫించన్ ఇస్తాము అని చెప్పిన పార్టీ జనసేన పార్టీ.
కొత్తపేట, (జనస్వరం) : నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేనపార్టీ ఆదేశాలు మేరకు కొత్తపేట నియోజకవర్గం స్థాయిలో ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పలివెల గ్రామంలో రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులును సన్మానించి వారి చేస్తున్న కృషితో పాటు వారి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. రైతే దేశానికి వెన్నుముక అలాంటి రైతు నేడు ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులుతో, ప్రకృతి వైపరీత్యాలుతో సతమతం అవుతుంటే మరొక ప్రక్క ప్రభుత్వం విధానాలుతో నలిగిపోతున్నారు. ప్రపంచ దేశాలు అన్ని ఆర్థిక మాంద్యం, కరోనా వంటి విపరీతమైన సంక్షోభాలు దెబ్బతింటే మనది వ్యవసాయాధారిత దేశం కనుక అలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం అంటే రైతే కారణంగా చెప్పుకోవాలి. కానీ నేడు రైతులకు సరైన ప్రభుత్వం సహయం అందటం లేదు. పంటకి గిట్టుబాటు ధర దొరకడం లేదు. రోజులు తరబడి పండించిన పంట గట్టులు మీదే ఉంటుంది. పంట అమ్ముకోవడానికి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కౌలు రైతు పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా వారికి కనిపిస్తున్నాయి. అలాంటి వారికి భరోసా నింపడం కోసమే జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అధికారం లేకపోయిన అయన కష్టార్జితం కౌలు రైతులు కుటుంబాలకు ఖర్చు చేస్తున్నారు. జనసేనకు అధికారం వస్తే రైతుకు ఫించన్ ఇస్తుంది అని చెప్పిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీనే. వచ్చేసారి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. రైతులకు పెద్ద పీటం వేస్తుంది. అన్ని విధాలుగా సహయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, కార్యదర్శులు బొక్కా అదినారాయణ, సంగీత సుభాష్, మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, తోట స్వామి, నాయకులు చింతపల్లి సత్తిపండు, తుల రాజు, నామాడి శివాజీ, ఐడియా మూర్తి, బండారు అబ్బులు, MPTC తమ్మన భాస్కర్ రావు, జంపోలు నాగేశ్వరరావు, ఉండ్రసపు వెంకన్న, కొత్తపల్లి నగేష్, నంబు రవికుమార్, గుర్రాల సతీష్, చిక్కం శివాజీ, బావిశెట్టి తాతాజీ, లంకే ప్రసాద్, కంఠంశెట్టి చంటి, చోడపనేడి ఉమా, పెద్దిరెడ్డి మల్లికార్జున్, అడపా ఆనంద్, మహదస బాబులు, సోము గంగధార్, నాగిరెడ్డి మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.