Logo
Date of Publish : 09 September 2020, 1:41 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్య గారి గండికోట జమ్మలమడుగు ఆకస్మిక పర్యటన

జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్య గారి గండికోట జమ్మలమడుగు ఆకస్మిక పర్యటన

              జమ్ములమడుగు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి  బొలిశెట్టి సత్యనారాయణ గారు, సీనియర్ నేత పి.వి.ఎస్ మూర్తి, రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ గారు,  జమ్మలమడుగు ఆకస్మిక పర్యటనపై విలేఖర్ల సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పునరావాసం కల్పించకుండా వెళ్ళమంటే ముంపు వాసులు ఎక్కకిడి వెళ్తారు? నీళ్లు వదిలేస్తాం ఎక్కడికి వెళ్తారో సంబంధం  లేదని కలెక్టర్ చెప్పడం అతని బాధ్యతా రాహిత్యమే అని అన్నారు.  1894 భూసేకరణ చట్టం ఆర్టికల్ 24 (2) ప్రకారం భూసేకరణ జరిగి 5 సంవత్సరాలు ఆ భూమిని సంబంధిత ప్రాజెక్ట్  కోసం వినియోగించక పోతే చట్ట ప్రకారం ఆ భూసేక రణ చెల్లదు.  పరిహారం అందించక పోగా దౌర్జన్యంగా తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామ ప్రజల జీవించే హక్కుకి భంగం కలిగిస్తున్న అధికారులను తక్షణం తొలగించక పోతే ప్రభుత్వం "చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు" అన్న రాజ్యాంగంలో ఆర్టికల్ 21 పౌరుల ప్రాథమిక అతిక్రమించినట్టు అవుతుందని గుర్తించాలి. ఉన్న ఫలంగా వెళ్లాలంటే పిల్లలను పశువులను తీసుకోని ఎక్కడికెళ్తారు అని ప్రశ్నించారు.  ప్రజలను ముఖ్యంగా బడుగు వర్గాలను పశువుల కన్నా ఘోరంగా చూస్తున్నదీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. భయబ్రాంతులకు గురి చేసి ప్రజలను తరిమేయడం తప్పని,  జనసేన ప్రజల పక్షాన నిలిచి న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని అని  అన్నారు.  ఒక ప్రశ్నకు సమాధానంగా మతం మీద జరుగుతున్న దాడిలో తన నిజాయితీ సీఎం నిరూపించుకోవాలి అని, అందువల్ల అంతర్వేది ఘటనపై తన మతాన్ని నిరూపించుకోవాలి.. అవినీతి ఆరోపణలు లేని అధికారులను మార్చడం వెనుక కుట్ర.. అన్యమతస్తుడైన జగన్ గారు తన నిజాయితీ నిరూపించుకోవాలి అని అన్నారు.  పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన వెంటనే ఇవోపై బదిలీ చేయాల్సింది పోయి కమీషనర్ పై చర్య తీసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే ప్రభుత్వం మేల్కొవాలి అని అన్నారు. రాష్ట్రం అరాచక పాలన, రాక్షస పాలన సాగుతోంది, సమాజంలో నీతి న్యాయం మిగిలిదంటే మీడియా కృషి పలితమే.. జగన్ చెప్పేదోకటి చేసేదోకటి అని అన్నారు.  వారం రోజులుగా అందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని, ఇదే విధమైన పాలన సాగిస్తే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.  జనసేన పార్టీ తరుపున నిర్వాసితుల పక్షాన కోర్టుకు వెళ్తామని, సింగూరు సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా ల్యాండ్ అక్విజేషన్ ఎలా చేస్తారని అన్నారు.  నిర్వాసితుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న ఆర్డీవో నాగన్నను తక్షణం విధుల నుండి తప్పించి శిక్షించాలి అని బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, నిర్వాసితులు, గ్రామప్రజలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com