నర్సీపట్నం, (జనస్వరం) : నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆసరా పథకం ప్రారంభోత్సవం పేరిట రూ.12లక్షల రూపాయులు దుర్వినియోగం అయ్యాయని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర గారు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్డున్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర గారు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై వివరించామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గారు వెంటనే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు చక్రవర్తి, జనసేన నాయకులు వెంకట రమణ, శ్రీను పాల్గొన్నారు. అలాగే నర్సిపట్నం మున్సిపాలిటీ 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, జనసేన టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆసరా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రూ.12లక్షల రూపాయులు దుర్వినియోగం అవడంపై నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై వివరించాలని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు జనసేన ఇంఛార్జ్ పంచాడ హరినాధ్, నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.