
నర్సీపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద బొడ్డేపల్లి కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ అంటూ ఛార్జీల వడ్డన మొదలు పెట్టే ప్రయత్నం పై నిరసన గళం వినిపించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో అంతే కాకుండా ఇసుక ధర మరింత భవన నిర్మాణదారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఇది చాలక కొత్తగా ఇంటి పన్నులు పెంచే దిశగా ప్రయత్నం మొదలు పెట్టేసి వెనువెంటనే ట్రూ అప్ ఛార్జీలు అంటూ సామాన్య ప్రజల నెత్తిన పెను భారం మోపడం ఎంతవరకు సబబు అంటూ జనసేన తరపున గళం వినిపించారు. 2014 నుండి 2019 వరకు వచ్చిన విద్యుత్ సంస్థ నష్టాలను ఈరోజు ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రజల నెత్తిన బండరాయి వేయడమే? ఎన్నికల హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం ఉండదు అని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు రకరకాల పేర్లతో జనాలను అయోమయానికి గురి చేసి విద్యుత్ రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసం? సామాన్య మానవులు ఈ కరోనా కష్టకాలంలో పని దొరక్క ఇబ్బంది పడుతుంటే ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి వీటికి తోడు ఇంటి పన్ను, చెత్త పన్ను అన్నీ పెంచుకుంటా పోతా ఉంటే మరలా వాటికి తోడు కరెంటు ఛార్జీలు పెంచుతాం అంటూ జనాభిప్రాయం సేకరణ లేకుండా ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఇటువంటి చర్యలకు పాల్పడడం కానీ ముందస్తు సమాచారం లేకుండా ప్రజలకు తెలియకుండా పెంచుకుంటూ పోతాం అంటే ఊరుకునే ప్రసక్తేలేదని ప్రజల తరఫున గళం వినిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, గొలుగొండ మండలం నాయకులు రేగుపండ్ల శివ, గూడెపు తాతబాబు, మారిశెట్టి రాజా, పరవాడ లోవరాజు, మోపాడచిరంజీవి, అగ్రహారపు గోవింద్, P. నాగు, పైల ఈశ్వరరావు, సామి రెడ్డి కిరణ్ కుమార్, కొత్తకోట రామ శేఖర్, బైన మురళి తదితరులు పాల్గొన్నారు.