గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ( జనస్వరం ) : పాలసముద్రం మండలo, వనదుర్గా పురంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలకు ప్రతిస్పందనగా నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్యాకేజీ కి నువ్వేనా బ్రోకర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ద్రోహి నారాయణస్వామి అని, దళితులకు ఆయన చేసింది ఏమీ లేదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అవకాశాన్ని, రిజర్వేషన్ను పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రిని, సాటి సామాజిక వర్గానికి ఆయన చేసింది జీరో అని ఎద్దేవా చేసారు. నీది అవకాశవాద రాజకీయం అని, నీ కంటే చిన్న వయస్సు ఉన్న ముఖ్యమంత్రిని కాళ్లు మొక్కి పదవి పొందిన నువ్వా పవన్ కళ్యాణ్ ను విమర్శించేదని దుయ్యబట్టారు. నీకు పవన్ కళ్యాణ్ కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, నీ క్యారెక్టర్ గురించి చెంగారెడ్డి మాటల్లో వింటే బాగుంటుందని, అయన సహాయo తీసుకొని మరిచావని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక ఆధ్యాత్మిక కెరీర్ గైడ్ అని, ఒక నిబద్ధత, విజన్ ఉన్న నాయకులని తెలియజేసారు. అయన విప్లవాత్మక యుగం వైపు నడిపించగల నాయకులని తెలిపారు. జీవితాన్ని అర్థవంతంగా ప్రయోజనకరంగా రూపొందించు కోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని నింపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఒక వ్యక్తిగా మన దేశానికి, ప్రపంచ స్థాయి ఆలోచనలు విజ్ఞానం నైపుణ్యం సమకూర్చే గొప్ప దార్షినికులని అభివర్ణించారు. కొన్ని కోట్ల మందిని ఒక్క లక్ష్యం వైపు నడిపించగల సమర్థులని తెలిపారు. మనిషిలో నిగూఢంగా ఉండే ఒక అంతర్గత ప్రతిభను వెలికి తీసి దానికి అనుగుణంగా జీవిత లక్ష్యాలను నిర్దేశించగలిగేటట్లు ఒకరికి ఒకరు పోటీ కాకుండా, అన్ని రంగాల్లో యువత యొక్క మేధో వనరుల కోసం ఎదురుచూసే పరిస్థితిని పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని అన్నారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా సామర్థ్యం, శీలం ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకునే పరిణితి, సంస్కృతిని తీసుకొస్తారని చెప్పారు. భవిష్యత్తులో డబ్బు రాయితీల ప్రభావంతో ఓటు వేసే వారి సంఖ్య శాతం తగ్గి సత్తా, సమర్థత, నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకునే కొత్త తరాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని తెలిపారు. ఏది ఏమైనా రకరకాల స్కీములతో ఓటు బ్యాంకు సృష్టించుకునే బదులు భవిష్యత్తు తరాలకు మేలు చేసే సంస్కరణలతో, అభివృద్ధితో ప్రజల మనసులను దోచుకునే రోజును పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని తెలియజేసారు. పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ఈ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం తథ్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన రాష్ట్రంగా ఆవిర్భవింప చేసి, భారతదేశానికి, ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలబెడతారని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టవోయ్ అనే గురజాడ అప్పారావు సూక్తిని తెలియజేస్తూ, పాలసముద్రం మండలంలో వెంగళరాజు కుప్పం వద్ద ఉన్న బ్రిడ్జిమీద నిత్యం రాకపోకల వల్ల ప్రమాదానికి గురై ఉన్నదని, దీని స్థానంలో కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరు మండలం బ్రిడ్జని వెడల్పు చేయవలసిన ఆవశ్యకత ఉందని, సంవత్సరాలుగా ఎంతోమంది ఆ బ్రిడ్జి మీద యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగిందని, దీనికోసం ఒక కొత్త ప్రపోజల్ తయారుచేసి వెడల్పు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయాన్ని జై కా నిధులు పుష్కలంగా ఉన్నా , నాసిరకం పనులతో నాశనం చేసి, ఇంకా పూర్తికాని పరిస్థితుల్లో ఉంటే, దానిని పట్టించుకోకుండా ఉండటం నీ అసమర్ధతకు నిదర్శనమని, మంచి సప్లై ఛానల్ ఏర్పాటు చేసి దీనిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెదురుకుప్పం మండలంలో పచ్చికాపల్లం నుండి కార్వేటినగరం వరకు, పచ్చికాపల్లం నుండి వయా వెదురుకుప్పం మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా చేసి, యుద్ధ ప్రాతిపదికన చేయాలనీ డిమాండ్ చేశారు. పెనుమూరు మండలంలో భూ కబ్జాలను అరికట్టి, ప్రత్యేక అధికారులతో కూడిన ఒక కమిటీని వేసి సమగ్ర సర్వే నిర్వహించి భూ బకాసురులను వదిలిపెట్టకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది ఒక ప్రజాప్రతినిధిగా చేయవలసిన పని అని, అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడటం ద్వారా అది అజ్ఞానానికి దారితీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లతీష్,జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి ఆకాష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి చంద్ర మౌళి, ఎస్ ఆర్ పురం మండల ఐ టి కోఆర్డినేటర్ మురగేష్, శ్రీకాంత్ రాజు, మండల కార్యదర్శి ఆనంద్, సాయి పాల్గొన్నారు.