Logo
Date of Publish : 30 July 2026, 8:58 pm
Editor : Sake Naresh

మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన మహిళా పోలీస్ స్టేషన్ సి ఐ అశోక్ బాబు

మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన మహిళా పోలీస్ స్టేషన్,నరసరావు పేట CI T. అశోక్ బాబు.

మానవ అక్రమ రవాణాను అరికట్టుదాం - ప్రతి మనిషి స్వేచ్ఛను కాపాడుదాం - మహిళా పోలీస్ స్టేషన్ CI T.అశోక్ బాబు.

నరసరావుపేట,జూలై 30( జనస్వరం)

నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ సీఐ టి.అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నరసరావు పేట లోని PNC & KR జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా గురించి విద్యార్థులు,యువత, మహిళలు, చిన్నారులు ఎలాంటి పరిస్థితుల్లో అక్రమ రవాణాకు గురయ్యే అవకాశం ఉంటుందో, అలాంటి ముఠాల వలలో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగాలు,విదేశీ ఉపాధి, విద్య పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.మానవ అక్రమ రవాణా ఎక్కువ జీతం వస్తుందని తప్పుడు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించడం, సోషల్ మీడియా ద్వారా స్నేహం చేసి మోసగించడం, నకిలీ వివాహాల పేరుతో మోసం చేయడం, చిన్నారులను అపహరించడం లేదా ప్రలోభ పెట్టడం ద్వారా జరుగుతుందని తెలిపారు.
వీటి వలన వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, శారీరక మానసిక హింసకు గురికావడం, చదువు మరియు భవిష్యత్తు నాశనం కావడం, కుటుంబాలకు దూరమవడం,నేర ముఠాల బారిన పడటం జరుగుతుందని కావున వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అలాగే సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.వ్యక్తిగత ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకూడదని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
మోసపు ఉచ్చులో చిక్కుకున్న బాధితులు సహాయం కోసం 112 - అత్యవసర పోలీసు సహాయం, 181 - మహిళల సహాయవాణి ,1098 - బాలల సహాయవాణి నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో CI గారితో పాటు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com