Logo
Date of Publish : 02 August 2022, 3:26 pm
Editor : Sake Naresh

నరసాపురం మెడికల్ కాలేజీ, జిల్లా కేంద్రాలను అమ్మేసిన ఘనత నర్సాపురం ఎమ్మెల్యేది : బొమ్మిడి నాయకర్

         నర్సాపురం ( జనస్వరం ) : నరసాపురం మండలం, సీతారామపురం నార్త్ మరియు సౌత్ పంచాయితీల క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు గ్రామస్థాయి కమిటీ నరసాపురం మండల అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. నరసాపురం MLA గడప గడపకు YSRCP అని చెప్పి ప్రజల దగ్గరికివెళ్తే సమస్యల కోసం నిలదీసి అడుగుతారని చెప్పి వాళ్ళ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి చక్కగా వాకింగ్ చేసి వస్తున్నారు. నరసాపురం మెడికల్ కాలేజీ మరియు జిల్లాకేంద్రాలను అమ్మేసిన ఘనత మన నరసాపురం ఎం‌ఎల్‌ఏ ది అని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com