- 15 సంవత్సరాల లోపు జిల్లా స్థాయి చెస్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
నంద్యాల, మార్చి 30 (జనస్వరం) : నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో నిర్వహించిన 15 సంవత్సరాల లోపు బాల, బాలికల జిల్లా స్థాయి చదరంగం జట్ల ఎంపిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు తరఫున పాల్గొనడానికి ఎంపికయ్యారు. బాలుర విభాగంలో మొదటి స్థానం శివ కార్తికేయ, రెండవ స్థానం హర్షిత్, మూడవ స్థానం రషీద్ మహమ్మద్, నాలుగవ స్థానం భువన కార్తికేయ సాధించారు. బాలికల విభాగంలో మొదటి స్థానం వెంకట దీక్ష శ్రీ, రెండవ స్థానం పద్మ నాగ నిఖిల, మూడవ స్థానం ఆశ్రిత భారతి, నాలుగవ స్థానం తపస్య సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రధాన కార్యదర్శి జి. రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జూన్ నెలలో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో ఎంపికైన జట్లు నంద్యాల జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. గెలిచినవారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి, గెలవని వారు తదుపరి పోటీలలో విజయాన్ని అందుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన అవసరమని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారితో పాటు వివిధ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ బహుమతి ప్రదానోత్సవంలో డాక్టర్ రవి కృష్ణతో పాటు జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కొండారెడ్డి, ఎన్ఆర్జి అకాడమీ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, ఆర్బిటర్ సుజాత, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.