అనంతపురం ( జనస్వరం ) : జగనన్న గోరుముద్ద… జగనన్న ఎంగిలి ముద్ద… జగనన్న అమ్మమ్మ ముద్ద… జగనన్న చెల్లి ముద్ద… జగనన్న నాయన ముద్ద…. పథకాలకు గొప్పగా పేర్లు పెట్టుకుంటే సరిపోదు క్షేత్రస్థాయిలో సరైన క్రమంలో అమలు చేయాలని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాంరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా BC, SC, ST మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు చాలా దారుణంగా నెలకొని ఉన్నాయి, సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు మరియు బాలురకు సరైన వసతులు మెరుగైన సదుపాయాలు కల్పించలేక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మూడు రోజుల క్రితం గుత్తి పట్టణమునందు BC బాలుర వసతి గృహంలో ఎలుకలు కొరికి దాదాపు 15 మంది బాలురు ఆసుపత్రిపాలైనారు… ఈ సంఘటన మరొక ముందే సింగనమల కస్తూరిబాయి BC బాలికల వసతి గృహంలో 160 మంది బాలికలు అస్వస్థకు గురైనారు. 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ చర్యను జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసి చేతులు దులుపుకొని పబ్బం గడుపుకుంటూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం BC, SC, ST, మైనారిటీలను ఉద్ధరిస్తున్నాం అని గొప్పలు చెప్పుకొని పబ్బం గడుపుకొని కాలయాపన చేస్తుంది. క్షేత్రస్థాయిలో మెరుగైన వసతులు సదుపాయాలు కల్పించలేని హీన.. దీన.. స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సీయం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా BC, SC, ST మైనారిటీ వసతి గృహాల్లో సరైన వసతులు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. లేని పక్షాన జనసేన పార్టీ తరఫున BC, SC, ST మైనార్టీల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.