Logo
Date of Publish : 10 October 2022, 1:47 pm
Editor : Sake Naresh

పెద్ద అబ్బీపురం గ్రామ రైతులకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

      ఆత్మకూరు, (జనస్వరం) : సుమారు రెండు నెలల క్రితం ఏ.ఎస్.పేట మండలం, పెద్ద అబ్బీపురం గ్రామంలో నాలుగు సంవత్సరాల వయసుగల 96 మామిడి చెట్లను నరికి వేయడం జరిగింది. అంతేకాక రెండు వ్యవసాయ బోర్లను ధ్వంసం చేయడం జరిగింది. ఈ అమానుష చర్యను ఖండిస్తూ ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బి.ఎస్.ఆర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాస్తారోకో సమయంలో స్థానిక పోలీసు అధికారులు వచ్చి, వారం రోజుల లోపల నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని తిరుపతిలో జరిగిన జనసేన పార్టీకి సంబంధించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు వారు వెంటనే తీవ్రంగా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర డి.జి.పి కి రాతపూర్వకంగా తెలియజేసి బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరడం జరిగింది. ఈ సంఘటన జరిగి రెండు మాసములు గడుస్తున్నప్పటికీ నేటి వరకు పోలీస్ అధికారులు ఎవరిని అరెస్టు చేయడం జరగలేదు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో బాధితులతో, జనసైనికులతో కలిసి ఆత్మకూరు జనసేనపార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com