హైదరాబాదు ( జనస్వరం ) : జనసేన పార్టీ పిఏసి సభ్యులు కొణిదల నాగబాబు గారిని హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ అలహరి సుధాకర్, గారు మరియు సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గార్లతో కలసి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు కేటాయించని కారణంగా జరుగుతున్న జాప్యం, ఆత్మకూరు మెట్ట ప్రాంత రైతుల వరప్రదాయని ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి , నియోజకవర్గ రైతాంగం ప్రధాన సమస్య అయిన, చుక్కల భూముల సమస్యను సుమోటోగా పరిష్కరించడం, సోమశిల జలాశయం ముందు భాగంలో దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరియు అద్వానంగా ఉన్న నియోజకవర్గ అంతర్గత రోడ్ల పరిస్థితి తదితర విషయాల గురించి నాగబాబు గారికి విన్నవించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com