ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గము, చేజర్ల మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొట్టుకుని పోయినపెరుమాళ్ళ పాడు నుండి చలపనాయుడు పల్లి వెళ్లే రహదారిని జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని పెన్నా పరివాహక ప్రాంత మండలాలైన అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, చేజర్ల మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఇదే విధంగా కొట్టుకుపోవడం జరిగిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రహదారులను, ప్రభుత్వము వెంటనే తాత్కాలికంగానైనా మరమ్మతులు చేసి, రాకపోకలకు అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com