వరదల వల్ల దెబ్బతిన్న రహదారులను సందర్శించిన ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు

    ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా  ఆత్మకూరు నియోజకవర్గము, చేజర్ల మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొట్టుకుని పోయినపెరుమాళ్ళ పాడు నుండి చలపనాయుడు పల్లి వెళ్లే రహదారిని జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులతో కలిసి  సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని పెన్నా పరివాహక ప్రాంత మండలాలైన అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, చేజర్ల మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఇదే విధంగా కొట్టుకుపోవడం జరిగిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రహదారులను, ప్రభుత్వము  వెంటనే తాత్కాలికంగానైనా మరమ్మతులు చేసి, రాకపోకలకు అనుకూలంగా  ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way