నాగర్ కర్నూల్ ( జనస్వరం ) : నిన్న రాత్రి నాగర్ కర్నూల్ పట్టణంలో ZPH గ్రౌండ్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధ్వర్యంలో ఆయన కనుసైగలో వారి అనుచరులు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పై చేసిన దాడినీ తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడుతూ మీకు నిజంగానే గెలుస్తాము అనే ధైర్యం ఉంటే నిజంగా గెలుపు మాదే అనే దమ్ము ఉంటే ఈరోజు ప్రజల మధ్యలో ఎందుకు తిరుగుతున్నారు. పదేళ్ల ప్రస్థానం పాదయాత్ర అంటూ ఎందుకు తిరుగుతున్నారు. నిజంగా మీరు నాగర్ కర్నూల్ ప్రజలకు మంచి చేసి ఉంటే నిజంగా నాగర్ కర్నూల్ ను అభివృద్ధి చేశాం అనే నమ్మకం ఉంటే నిజంగా నాగర్ కర్నూల్ ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తే. మీరు చేసిన మంచి మిమ్మల్ని గెలిపిస్తది కదా అని అన్నారు. మీకూ ఓడిపోతానని భయం మీలో ఉంది కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. పదవి అనే అహంకారం డబ్బు అనే మదంతో నాగర్ కర్నూల్ లో నా అంత మొగోడు లేడు అని నాగర్ కర్నూల్ లో నాకు పోటీ లేడు అని విర్రవీగుతూ మాట్లాడుతున్న మీ మాటలకు, మీ దోపిడీలను, మీ దౌర్జన్యాలను, మీ నల్లమట్టి దందాలను అడ్డుకోవడానికి నేనే పోటీ ఒక్క బిసి బిడ్డ,, ఒక్క బహుజన బిడ్డ నిన్ను నీ అవినీతి పాలనను ప్రశ్నిస్తే, దాడులు చేయిస్తవ ఖబడ్దార్ బిడ్డ అంటూ ఫైర్ అయ్యారు. ఏరోజు అయితే పోతిరెడ్డిపల్లి గ్రామంలో, నా మీద కక్షపుర్వకంగా మీరు పెట్టిన ప్రెస్ మిట్ ఎదైతే ఉందో అక్కడి నుంచే నీ పతనం మొదలైంది. ప్రాణాలకు భయపడే వాడు కాదు వంగ లక్ష్మణ్ గౌడ్ గుర్తుంచుకో CEO. నాగర్ కర్నూల్ లో ఒక బిసి పాలన, ఒక బహుజన పాలన తిరిగి తీసుకురావాలనే ఆశయంతో జనసేన పార్టీ కండువా వేసుకున్న రోజునే ప్రాణాలకు తెగించి వచ్చాను. మీ ఉడత ఉపుల్లకు, మీ చెంచాల దాడులకు భయపడే వ్యక్తి కాదు వంగ లక్ష్మణ్ గౌడ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, జాని, ఎదుల శరత్ గౌడ్, కొడిగంటి సాయి, పేరుమాల శేఖర్, మూర్తి నాయక్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, మహేష్, చెన్నామొని మహేష్, చందు, సురేష్, గద్వాల్ మహేష్, లింగం నాయక్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com