అనంతపురం ( జనస్వరం ) : జనసేన సీనియర్ నాయకులు దంపేట్ల శివ తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ స్పీకర్ మరియు ప్రస్తుత జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టును ఖండించారు. వైజాగ్ లో టైకోన్ జంక్షన్ మూసివేయడంపై పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతూ మరియు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా నాయకుడైన నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం చూస్తే ప్రజాస్వామ్య విలువలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కా ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ మరియు మిత్రపక్షాల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తద్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com