ఉంగుటూరు, (జనస్వరం) : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మంచినీటికి ఇబ్బంది రాకుండా తాగునీరు సరఫరా చేయడం అభినందనీయమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం భీమవరం పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన తర్వాత ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లక్ష్మీ నారాయణ ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు సరఫరా ట్యాంకర్లను మనోహర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ట్యాంకరలను ప్రారంభించారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆలోచనలను ధర్మరాజు పాటిస్తూ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల మన్నలను పొందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, మల్లీనీడి తిరుమల రావు, తణుకు నియోజవర్గం ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, ఏలూరు నియోజవర్గం ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉండి నియోజవర్గం ఇంచార్జ్ జుత్తుగా నాగరాజు, చిన్న మాల చంద్రశేఖర్, కరాటం సాయి, పోలవరం ఇంచార్జ్ సిహెచ బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, తాడేపల్లిగూడెం నియోజవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ రావు, మండల జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com