
తుని ( జనస్వరం ) : తుని పట్టణం 20 వార్డు ఇసుకలపేటకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు వాసంశెట్టి రాజు ఇటీవల సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. రాజు తల్లిదండ్రులని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్త అకాల మరణం చెందడం దూరం కావడం పట్ల విచారణ వ్యక్తం చేసారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ క్రియాశీలక సభ్యులకు రూ.5లక్షల భీమా చెక్కును రాజు తల్లి అందజేశారు. ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుని పట్టణ ప్రజలకు మున్సిపాలిటీలో పంచాయతీలో అర్థం కానీ పరిస్థితుల్లో నెలకోందని పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వష్టం చేశారు. పట్నంలో సమస్యలు తిష్ట వేస్తే ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కనీసం డంపింగ్ యార్డ్ సమస్యలకు ఏళ్ల తరబడి పరిష్కారం చూపలేకపోతున్నారని తెలిపారు. రోడ్లు మురకకాలంలో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడు కరువయ్యారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఏసి సభ్యులు పంతం నానాజీ, పార్టీ నాయకులు శెట్టబత్తుల రాజబాబు, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, బాడపాటి శివదత్, సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివప్రసాద్, తదితరులు, జనసైనికులు పాల్గొన్నారు.