Logo
Date of Publish : 11 September 2022, 4:19 pm
Editor : Sake Naresh

తాడికొండ నియోజకవర్గంలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం ఏర్పాటు

             గుంటూరు ( జనస్వరం ) : తాడికొండ నియోజకవర్గంలో జిల్లా కమిటీ సభ్యులు తడవర్తి కేశవ, బంధనాల జ్యోతిల ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. అనంతరం నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు నియామకపత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… ఈరోజు మన నాయకుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మండల, గ్రామ అధ్యక్షులదే ముఖ్యపాత్ర అని తెలిపారు. మన పార్టీ అధ్యక్షులు వారు ఏ కార్యక్రమం తలపెట్టిన మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకువెళ్లే బాధ్యత మనందరిదీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేక స్థానం, ముందు వరుసలో ఉంచాలి అని ఆశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, శిఖాబాలు, మండల అధ్యక్షులు యర్రగోపుల నాగరాజు, గులకవరపు నరేశ్, రాచర్ల నాగరాజు, ఎన్. వెంకట్రావు, సుబ్బారావు, ఏపూరి పూర్ణ, హరి వేణీకృష్ణ, హేమంత్, అనిత, జయశ్రీ, నాగబాబు, నాయక్ నియోజకవర్గ, మండల, గ్రామ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com